టొమాటో ఆరోగ్య ప్రయోజనాలు

ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే కూరగాయల్లో టొమాటో ఒకటి.
నిజానికి ఇది కూరగాయ కాదు ఇది ఒక ఫ్రూట్.
దీని శాస్త్రీయ నామం “సొలనం లైకోపెర్సికం”.
వీటికి తెలుగులో సీమ వంగ, రామములగా అనే పేర్లు ఉన్నాయి.
టమాటాలో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో ఔషధ గుణాలున్నాయి.
వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చాలా రకాల రోగాలకు చెక్ పెట్టేయొచ్చు.
టొమాటా లో ఎన్నో పోషకాలతో పాటు ఐరన్, క్యాల్షియం, విటమిన్ సి, మెండుగా ఉన్నాయి.

వీటిలో ఉండే క్లోరోజేనిక్ ఆసిడ్ శరీరంలో నైట్రోజన్ సంబంధించిన పదార్థాలను పేరుకు పోనివ్వకుండా చేస్తుంది. రక్తనాళాలని శుభ్రపరుస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది.

వీటిని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది.ఎసిడిటీ, కడుపుబ్బరం, కడుపులో గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి.

కాలేయ పనితీరుకు కాలేయ సంబంధిత రోగాలకు నివారణగా ఇది చాలా ఉపయోగపడుతుంది.
చర్మానికి మెరుపును కాంతిని మరియు ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. వీటిలోని ఆంటీ ఏజింగ్ లక్షణాలు చర్మం యొక్క సాగే గుణాన్ని తగ్గిస్తుంది. ముడతలను నివారిస్తుంది.
టొమాటో లోని విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది.
వీటిలో క్యాలరీస్ చాలా తక్కువ కాబట్టి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

టోమాటో లోనీ లైకోపిన్ అనే ఆంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఏర్పడిన ఫ్రీ రాడికల్ కణాలతో పోరాడి క్యాన్సర్ భారిన పడకుండా చేస్తాయి.

టొమాటోలో ఉండే “ట్రిప్తో ఫాన్”అనే రసాయనం నిద్రపుచ్చే డానికి అవసరమైన మెలటోనిన్ అనే హార్మోన్ని ప్రేరేపిస్తుంది.

Related Posts

58 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *