Conjunctivits: కండ్లకలక అంటే ఏమిటి.?ఎలా వస్తుంది..?నివారణ ఏమిటి….?

కండ్లకలక ఇది కంటికి సంభందించిన వ్యాధి . కండ్లు ఎరుపెక్కి నీరు కారుతూ దురదతో ఇబ్బంది పెడుతుంది ఈ వ్యాధి. ఇంగ్లీష్ లో ఈ వ్యాధిని Eye ఫ్లూ, Conjunctivits మరియు pink eye అని పిలుస్తారు.

సాధారణంగా ఈ వ్యాధి వర్షాకాలం మరియు శీతాకాలం లో వస్తుంటుంది. వాతావరణం లో ఉన్న వైరస్ లు మరియు బ్యాక్టీరియాలు కళ్లకు చేరడం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది.

లక్షణాలు:

1) కళ్లు ఎరుపు లేదా గులాబి రంగులోకి మారతాయి.

2) తేలిక పాటి దురద మరియు గ్రుచ్చుకున్నట్లుగా అవుతాయి.

3) కంటి నుండి నీరు లేదా స్రావం కారుతుంటుంది.

4) వెలుతురు చూడటం కష్టమవుతుంది.

5) నిద్ర తరువాత కంటి రెప్పలు అంటుకుంటాయి,కళ్ళు తెరవడం కష్టం అవుతుంది

6) ఇది మొదటగా ఒక కంటికి వ్యాపించి తరువాత రెండవ కంటికి వ్యాపిస్తుంది.

ఈ కండ్లకలక వ్యాధి వేగంగా వ్యాప్తి చెందినప్పటికీ అంతగా భయపడాల్సిన అవసరం లేదు.మామూలుగా వారం లేదా రెండు వారాలలో దానికదే నయమవుతుంది.

జాగ్రత/నివారణ:

1)కంటి నుంచి కారె స్రావం లేదా ద్రవాన్ని వేడి చేసి చల్లార్చిన నీటితో కడుగుతుందాలి.

2)శుభ్రమైన గుడ్డ లేదా బట్ట ముక్క తో కళ్ళను శుభ్ర పరుచకోవాలి.వాడిన గుడ్డ మళ్ళీ వాడకుండా జాగ్రత వహించాలి.(వాడిన గుడ్డను వీలైతే కాల్చి వెయ్యాలి)

3) ఆంటీ బయోటిక్ eye డ్రాప్స్ వేసుకోవాలి.(గమనిక:డాక్టర్ను సంప్రదించి వాడాల్సి ఉంటుంది)

4) కాచి చల్లార్చిన నీటిని గోరు వెచ్చగా తాగుతుండాలి.

5) కళ్ళను పూర్తిగా కప్పబడిన కళ్లద్దాలు ధరించాలి.

6) వీలైతే తేనె నిమ్మరసం తో ఒక రోజు ఉపవాసం చేస్తే బాగుంటుంది.(ఈ ఉపవాసం వ్యాధి త్వరగా నయం అయ్యేందుకు సహాయపడుతుంది.)

7)చిన్న పిల్లలలో ఈ వ్యాధి సోకితే వ్యాధి నయం అయ్యేంతవరకు బడికి సెలవు పెట్టి ఇంట్లో పై జాగ్రత్తలు పాంటించాల్సి ఉంటుంది.ఎందుకంటే ఈ వ్యాధి వేగంగా వ్యాపించే డిసీస్ కాబట్టి స్కూల్ లో లేదా చుట్టూ ప్రక్కల వారికి వ్యాపించే అవకాశం ఎక్కువ.

కారణాలు:

1) ఉక్క పోతకు చేమటావచ్చి చేతులు మరియు ముఖం పై మలినాలు లేదా వైరస్ లు చేరడం .

2)మలినాలు అపరిశుభ్ర మైన చేతులతో కళ్ళను తరచూ తాకుతుండండం లేదా వ్యాధి సోకిన రోగి యొక్క కలుషితమైన వస్తువులను తాకడం లేదా రోగి యొక్క కంటి నుండి కారే స్రావం లేదా ద్రవం తాకడం ఈ వ్యాధికి కారణం.

3)పరిశుభ్రత పాటించక పోవడం.

అపోహలు:చాలా మంది అంటుంటారు. కండ్లకలక వ్యాధి ఉన్న వారి కండ్లను చూస్తే ,చూసిన వారికి ఆ వ్యాధి వస్తుందని…!

ఇది అపోహ మాత్రమే కండ్లకలక వ్యాధి ఉన్న వారి కళ్లను చూడటం వల్ల ఈ వ్యాధి వ్యాపించదు.

Related Posts

3,708 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *