బాదం ఆరోగ్య విశిష్టత

బాదం ఒక రుచికరమైన డ్రై ఫ్రూట్. బాదం చాలా విశిష్టమైనది వీటిలో బలవర్ధకమైన పోషకాలు ఉన్నాయి.

బాదం పుట్టుక మధ్య దక్షిణాసియా దేశాల నుండి అనేక ప్రాంతాలకు వ్యాపించింది.
దీని శాస్త్రీయ నామం “పునస్ డల్సిస్”.
ఇవి కూల్ డ్రింక్స్ , కేక్స్, కాస్మెటిక్స్,చాక్లెట్ అంటూ ఎన్నో రకాల తయారీ రంగాలలో విరివిగా ఉపయోగించబడుతున్నవి.
బాదం లో విటమిన్స్ మినరల్స్ ,pyto chemicals ,amino acids వంటి ఎన్నో పోషకాలు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.

బాదం శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది నీరసాన్ని తగ్గిస్తుంది.
ఇవి కండపుష్టికి ,బరువులు మోసే వారికి ,ఆటలాడే వారికి చాలా ఉపయోగపడతాయి.
బాదం లో ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ మెండుగా ఉన్నాయి ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ శాతాన్ని పెంచుతాయి.
బాదం లో పుష్కలంగా ఉండే విటమిన్ E చర్మ సౌందర్యానికి మేలు చేస్తుంది ఇది చర్మానికి మాశ్చరైజర్ గా పనిచేసి దేహ కాంతిని పెంచుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది దాంతోపాటే స్త్రీ మరియు పురుష సంబంధిత హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.

వీటిలోని ఆంటీ ఎజింగ్ ప్రాపర్టీస్ చర్మంపై ఏర్పడే ముడతలు నుండి కాపాడుతుంది.
బాదం లోని ఆంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ పెద్ద పేగు మరియు ఇతర రకాల క్యాన్సర్లపై పోరాడే లక్షణం కలిగి ఉంది.
బాదం మెదడు ఆరోగ్యాన్ని పెంచుతుంది ఆల్జీమర్స్ వంటి సమస్యల నుండి కాపాడుతుంది.
ఇందులో ఉండే కాపర్ మరియు ఐరన్ లు రక్తహీనతను దూరం చేస్తాయి.
బాదం నరాలను మరియు కండరాలను బలోపేతం చేస్తుంది.
బాదం ఒత్తిడిని తగ్గిస్తుంది.
వీటిని తినడం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్ గా ఉంటాయి.
బాదం లోని పోషకాలు అన్ని సమృద్ధిగా ఒంటికి పట్టాలంటే వీటిని 6 నుంచి 8 గంటలు నీటిలో నానబెట్టిన తర్వాత తినడం మంచిది.
గర్భిణీ స్త్రీలకు బాలింతలకు ఎదిగే పిల్లలకు బరువు పెరగాలనుకునే వారికి వీటిలో కావలసిన పోషకాలు లభిస్తాయి.
బాదం లోని పోషకాలు జుట్టు ఎదుగుదలకు జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Related Posts

2,478 Comments

Leave a Reply to BillyZorma Cancel reply

Your email address will not be published. Required fields are marked *